రూ.35 వేల నగదు అందజేత భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామానికి చెందిన తమ సహచరుడు, ఎస్‌ఎస్‌సీ క్లాస్‌మేట్ రాఘవేంద్రరావు అకాల మరణం పట్ల ఆయన మిత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మానవీయతతో స్పందించిన ఎస్‌ఎస్‌సీ క్లాస్‌మేట్ మిత్రులు కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.35 వేల నగదును ఆర్థిక సాయంగా అందజేశారు. ఆపద సమయంలో మృతుడి కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు మిత్రులు తెలిపారు. రాఘవేంద్రరావు కుటుంబానికి తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పిట్ల బాపూరావు, ప్రభాకర్, గణేష్‌తో పాటు ఎస్‌ఎస్‌సీ క్లాస్‌మేట్ మిత్రులు పాల్గొన్నారు