ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ ఆ దేశ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆడుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రూక్‌లో అద్భుతమైన ప్రతిభ ఉందని, అతను సరిగ్గా దృష్టి సారిస్తే సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా వంటి దిగ్గజాల స్థాయికి ఎదుగుతాడని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, తనకున్న అపారమైన సామర్థ్యానికి తగ్గట్లుగా బ్రూక్ న్యాయం చేయడం లేదని విమర్శించారు. టెస్టుల్లో కూడా పరిమిత ఓవర్ల క్రికెట్ శైలిలోనే ఆడుతూ, ప్రతి బంతిని బాదేయాలనే […]