Kaizer News

ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి..

ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి..

· State - Telangana · prabhanews.com

కడెం ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ లక్ష్మి కడెం, ఆంధ్రప్రభ: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కడెం మండల పంచాయతీ అధికారి టి. శ్రీనివాస్, బెల్లాల్ గ్రామ సర్పంచ్ బొంతల లక్ష్మి, డాక్టర్ భూమన్న యాదవ్ సూచించారు. కడెం మండలంలోని బెల్లాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామ ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు రెండు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేరు చేసి నిర్దేశిత చెత్తబుట్టల్లో వేయడం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచవచ్చన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎ. అనూష, పంచాయతీ కార్యదర్శి వి. గిరిధర్, జీపీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు రాజన్న, రవి, మల్లన్న, బుచ్చన్న, రామన్న తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News