Kaizer News

ఏథర్ కొత్త ఈవీ కోణార్క్

ఏథర్ కొత్త ఈవీ కోణార్క్

· State - Telangana · v6velugu.com

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ​టూవీలర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, మార్కెట్లోకి కొత్త స్కూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది. కోణార్క్​ పేరుతో సరికొత్త మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శనివారం జరిగిన యాన్యువల్​ కమ్యూనిటీ డే ఈవెంట్​లో ఆవిష్కరించింది. ధర రూ.లక్ష (బెంగళూరు ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. దీని ద్వారా మాస్ మార్కెట్ కొనుగోలుదారులను ఆకర్షించాలని కంపెనీ కోరుకుంటోంది. కోణార్క్​100 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ధర రూ.లక్ష కాగా, 125 కిలోమీటర్ల వేరియంట్ ధర రూ.1.22 లక్షలు. హైఎండ్​144 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ధరను రూ.1.45 లక్షలుగా ఖరారు చేశారు. భవిష్యత్తులో మరికొన్ని వేరియంట్లను కూడా మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఎస్ వేరియంట్లలో ఏడు ఇంచుల డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ్యూ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, బేస్ వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4.2-అంగుళాల డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే అమర్చారు. కీలెస్ సిస్టమ్ కలిగిన మ్యాజిక్ కీ ద్వారా స్మార్ట్ వేక్, వాక్-అవే ఆటో-లాక్, ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ స్టార్ట్​ వంటి సదుపాయాలు లభిస్తాయి. కీఫోబ్ లేదా టచ్ స్విచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరుచుకునే 31-లీటర్ల అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీట్ స్టోరేజ్ దీని సొంతం. ఇరుకైన ప్రదేశాలలో సులువుగా నడిపించడానికి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాక్ అసిస్ట్ సహకరిస్తుంది. సౌకర్యవంతమైన పిలియన్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెస్ట్, సెంటర్ స్టాండ్ ఉన్నాయి. ఏథర్ యాప్ ద్వారా వాహన ఆరోగ్యం, రీసేల్ వాల్యూ అంచనాలను తెలుసుకోవచ్చు. ఏఈబీఎస్ ​బ్రేకింగ్ సిస్టమ్​ ఉంటుంది. మోడల్ రేంజ్ బ్యాటరీ డెలివరీ ధర కోణార్క్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 100 100 కిమీ 2.1 కిలోవాట్స్​ 2027 క్యూ1​ రూ. లక్ష ఎస్ 125 125 కిమీ 2.7 కిలోవాట్స్​ వచ్చే నెల రూ. 1.22 లక్షలు ఎస్ 161 161 కిమీ 3.5 కిలోవాట్స్​ వచ్చే నెల రూ.1.45 లక్షలు ఎస్ 200 200 కిమీ - 2027 క్యూ3 త్వరలో ప్రకటిస్తారు జెడ్ 125 125 కిమీ - 2027 క్యూ3 త్వరలో ప్రకటిస్తారు జెడ్ 161 161 కిమీ - 2027 క్యూ3 త్వరలో ప్రకటిస్తారు

Original source: v6velugu.com
Read more on Kaizer News