ముత్తుకూరు, ఆంధ్రప్రభ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామపంచాయతీ ఆరాధ్య దైవం అంకమ్మ తల్లికి పొంగళ్లు నివేదన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. గౌడ సామాజిక వర్గం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వైకాపా అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి హాజరై గ్రామ దేవతను దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు పొందారు. గ్రామదేవత గ్రామాన్ని చల్లగా చూడాలని తాము కోరుకున్నట్లు పేర్కొన్నారు