పెనుగొండ: పెనుగొండ విశ్వతేజ డిగ్రీ కళాశాలలో గిడుగు రామమూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవ వేడుక శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ కవి గేయ గాన గంధర్వ పురస్కార గ్రహీత డాక్టర్ సాదే బాలచందర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు తెలుగు భాషపై అభిమానం పెరిగేలా కవితలు గేయాలు గజల్ గానం చేస్తూ ఉత్తేజంగా ప్రసంగించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు భాషలో తియ్యదనం బాలచందర్ గారి పాటల ద్వారా మాటల ద్వారా పరవశింప చేసిందని ప్రశంసించారు. వైస్ ప్రిన్సిపాల్ సూర్యనారాయణ తెలుగు అధ్యాపకులు సతీష్ మరియు అధ్యాపక అధ్యపకేతర సిబ్బంది మరియు విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ యమ్ నాగబాబు డాక్టర్ బాలచందర్ కు ధన్యవాదాలు తెలియ జేశారు అనంతరం ముఖ్య అతిథి గేయ గాన గంధర్వ పురస్కార గ్రహీత కవి డా.బాలచందర్ ను ఘనంగా సత్కరించారు