Guntur: రైతులకు మరింత మెరుగైన సేవలు, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే లక్ష్యంతో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ICAR-ATARI జోన్-X, కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ఆధ్వర్యంలో గుంటూరు లాంలో నిర్మించిన ‘ఫార్మర్స్ హాస్టల్ బిల్డింగ్’ ఘనంగా ప్రారంభించిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు. ఈ కార్యక్రమానికి ICAR న్యూఢిల్లీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. రాజ్‌బీర్ సింగ్ గారు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు, వివిధ శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యే రైతులకు అవసరమైన వసతులు కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. రైతు బలోపేతమే రాష్ట్ర ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నూతన వ్యవసాయ విధానాలు, పంటల సాగులో మెరుగైన పద్ధతులు, అధిక దిగుబడులు సాధించే సాంకేతికతపై అవగాహన కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లవచ్చన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఇటువంటి మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.రైతు సంక్షేమం,వ్యవసాయ అభివృద్ధి,ఆధునిక సాంకేతికత అందుబాటులోకి తీసుకురావడం అనే లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలు భవిష్యత్‌లో రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వి.వి. రమణ, గౌరవ వైస్ ఛాన్సలర్, SVVU తిరుపతి, డా. షేక్ ఎన్. మీరా, డైరెక్టర్, ICAR-ATARI జోన్-X, హైదరాబాద్, బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సభ్యులు, అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొననున్నారు