రైతుల సంక్షేమానికి కృషి చేస్తా: ఈడ్దుల మస్తాన్ బాబు చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పిఎసిఎస్) పర్సన్ ఇన్ఛార్జి కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఈడ్దుల మస్తాన్ బాబు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా సహకార అధికారి కె నాగార్జున సమక్షంలో ఈడ్దుల మస్తాన్ బాబుతో పాటు పర్సన్ ఇన్ఛార్జి కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ మస్తాన్ బాబు, నూతన కమిటీ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన పాలకమండలి (పర్సన్ ఇన్ఛార్జి కమిటీ) సభ్యులు: చైర్ పర్సన్ గా ఈడ్దుల మస్తాన్ బాబు (దండు మల్కాపురం), సభ్యులుగా పర్నె శివారెడ్డి (లింగోజిగూడెం), బొబ్బిళ్ల రాజేంధర్ (చౌటుప్పల్), సుర్కంటి లక్ష్మమ్మ (లింగారెడ్డిగూడెం), నల్ల నరేందర్ రెడ్డి (మందోల్లగూడెం), జక్కిడి వెంకట్ రెడ్డి (పెద్ద కొండూరు), రావుల స్వామి (తంగడపల్లి), ఎర్ర పెంటయ్య (పీపల్ పహాడ్) పానుబోతు లచ్చిరాం నాయక్ (పీపల్ పహాడ్), గుర్రం మనోహర్ రెడ్డి (డి నాగారం), మల్కాపురం సుగుణమ్మ (డి నాగారం), మేకల దేవేందర్ రెడ్డి (ఖైతాపురం), బత్తుల శ్రీహరి (ధర్మోజిగూడెం) లు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన చైర్పర్సన్ ఈడుదుల మస్తాన్ బాబు తో పాటు సభ్యులను పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం చైర్ పర్సన్ మస్తాన్ బాబు మాట్లాడుతూ తాను నూతన చైర్పర్సన్ గా ఎంపిక కావడానికి కృషిచేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి సహకరించిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని మస్తాన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె సురేష్, ఏఎంసి ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోశిక వినయ్, పిఎసిఎస్ కార్యదర్శి వై రమేష్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ రైతుల సంక్షేమాభివృద్ధికి, పరపతి సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు