Kaizer News

యూఎస్‌ ఓపెన్‌ బరిలో అల్కరాజ్‌.. టైటిల్‌ నిలబెట్టుక

యూఎస్‌ ఓపెన్‌ బరిలో అల్కరాజ్‌.. టైటిల్‌ నిలబెట్టుకునేనా?

· Sports · sakshi.com

స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నాడు. కుడిచేతి మణికట్టు గాయంతో నాలుగు నెలల పాటు టెన్నిస్‌కు దూరమైన అల్కరాజ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు డిపెండింగ్ చాంపియ‌న్ హోదాలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా యూఎస్ ఓపెన్ ఆడ‌నుండ‌డంపై అల్క‌రాజ్ స్పందించాడు. "మీరు మ‌ళ్లీ పాత అల్క‌రాజ్ స్టైల్ ఆట‌ను చూడ‌బోతున్నారు. నాకు మంచి పోటీ కావాలి. ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అయితే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నాకు స‌వాలుతో కూడుకున్న‌ది. గ‌తంలో ఫెద‌ర‌ర్‌, నాద‌ల్ గాయాల నుంచి కోలుకొని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన విష‌యాన్ని ప్రేర‌ణ‌గా తీసుకుంటున్నా. టోర్నీలో మ్యాచ్‌లు గెల‌వడం అంత సులభం కాక‌పోవ‌చ్చు. నా శ‌క్తి మేర‌కు క‌ష్ట‌ప‌డుతా" అని చెప్పుకొచ్చాడు. ఇక ప్ర‌స్తుత ప్ర‌పంచ నంబర్‌వన్‌, ఇట‌లీ స్టార్ జానిక్ సిన‌ర్ మోకాలి గాయంతో వైదొలిగాడు. దీంతో ర‌ష్యా స్టార్ అలెగ్జాండ‌ర్ జ్వెరెవ్‌కు టాప్‌సీడ్ ద‌క్కింది. సిన‌ర్ లేన‌ప్ప‌టికీ జ్వెరెవ్‌తో పాటు జ‌కోవిచ్ రూపంలో అల్క‌రాజ్‌కు గ‌ట్టిపోటీ ఎదురుకానుంది. ఇక అల్క‌రాజ్ సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌ను రోమ‌న్ స‌ఫిఉల్లిన్‌తో ఆడ‌నున్నాడు. ఇక మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో సెరెనా విలియ‌మ్స్‌తో క‌లిసి అల్క‌రాజ్ వార్మ‌ప్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. గాయంతో ఈ ఏడాది ప్రెంచ్ ఓపెన్‌తో పాటు వింబుల్డన్‌కు దూరమైన అల్కరాజ్.. సీజన్ మొదటి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ను అల్క‌రాజ్ కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఫైనల్లో అల్క‌రాజ్ సెర్బియా దిగ్గ‌జం నొవాక్ జ‌కోవిచ్‌ను మ‌ట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. అల్క‌రాజ్ కెరీర్‌లో ఇది ఏడో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావ‌డం విశేషం. ఇక 2025 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అల్క‌రాజ్ కైవ‌సం చేసుకున్నాడు. నాటి ఫైన‌ల్లో సిన‌ర్‌ను ఓడించిన అల్క‌రాజ్ రెండోసారి టైటిల్ గెలుచుకున్నాడు. Read: ‘బాయ్‌కాట్‌ విషయమే తెలీదు.. అప్పుడు భోజనం చేస్తున్నాం’ 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ఇది నెక్స్ లెవల్ స్మగ్లింగ్.. సినిమాల్లో కూడా చూసి ఉండరు నోరెళ్లబెట్టిన పోలీసులు అవమానించిన ఒక్కొక్కరికి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి.. జగనన్న 2.0 మీ ఊహకే వదిలేస్తున్న ప్రొద్దుటూరులో వ్యభిచారం.. TDPపై MLA వరదరాజులరెడ్డి సంచలన వ్యాఖ్యలు వెనక్కి తగ్గని రష్యా.. ఉక్రెయిన్ నాశనం కావాల్సిందే!

Original source: sakshi.com
Read more on Kaizer News