Kaizer News

Bheemili: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా వెంప

Bheemili: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా వెంపాడ శ్రీనివాసరెడ్డి

· State - Telangana · hmtvlive.com

Shorts భీమిలి నియోజకవర్గం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కమిటీలో కీలక నియామకం జరిగింది. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు వెంపాడ శ్రీనివాసరెడ్డిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా (పార్లమెంట్‌) నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డికి ఈ కీలక బాధ్యతలు అప్పగించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వెంపాడ తనపై నమ్మకం ఉంచి ఇంతటి ఉన్నతమైన బాధ్యతను అప్పగించిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వెంపాడ శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌ పరిధిలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అఖండ విజయమే లక్ష్యంగా, శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని భరోసా ఇచ్చారు. నాడు జెండా పట్టిననాటి నుంచి నేటి వరకు..మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం, అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేసిన వేళ.. ఆయన వెన్నంటి నడిచిన నమ్మకమైన సైనికుడు వెంపాడ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం రోజే పార్టీ జెండాను భుజానికెత్తుకుని భీమిలి మండలం, నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకూ వైఎస్సార్‌ కాంగ్రెస్ విధానాలను తీసుకెళ్లారు. ప్రజా సమస్యలపై జరిగిన ధర్నాలు, ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటూ యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు. జగనన్న చేపట్టిన చారిత్రాత్మక ప్రజా సంకల్ప యాత్రలో అడుగడుగునా సంఘీభావం తెలుపుతూ ఆయనతో పాటు నడిచి, అధినేత చేత ప్రశంసలు అందుకున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నిఖార్సైన నాయకుడి కష్టాన్ని గుర్తించి, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్ర స్థాయి పదవిని కేటాయించడం పట్ల విశాఖపట్నం జిల్లా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, భీమిలి నియోజకవర్గం లో వెంపాడ అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. నిబద్ధత గల నాయకుడికి దక్కిన అర్హమైన గౌరవం ఇదని వారు కొనియాడారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News