Kaizer News

Watch: ఆటోను ధ్వంసం చేసిన మహిళ.. తర్వాత ఏం జరిగింద

Watch: ఆటోను ధ్వంసం చేసిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?

· National - India · ntnews.com

న్యూఢిల్లీ: తన కారును ఆటో స్వల్పంగా ఢీకొట్టడంతో ఒక మహిళ ఆగ్రహం చెందింది. ఆ ఆటోపై తన ప్రతాపాన్ని చూపింది. హెడ్‌లైట్‌, వైపర్‌ను ధ్వంసం చేసింది. ఆటో డ్రైవర్‌ను ఆ మహిళ దూషించింది. తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆమె అన్నది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. (woman vandalises auto) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. హైదర్‌పూర్ బాద్లీ మోర్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై వెళ్తున్న కారును ఒక ఆటో స్వల్పంగా రాసుకున్నది. ఈ నేపథ్యంలో ఆ కారులోని మహిళ ఆగ్రహించింది. ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. అంతటితో ఆగక ఆ ఆటోను ధ్వంసం చేసింది. హైడ్‌లైట్‌తో పాటు వైపర్‌ను విరిచేందుకు ప్రయత్నించింది. ఆటో డ్రైవర్‌ను దూషించడంతో పాటు, తాను సిబ్బందినని, తనపై ఎలాంటి చర్య తీసుకోరని ఆమె అన్నది. కాగా, ఆ సమయంలో బైక్‌పై అటుగా వెళ్తున్న విశాల్ అనే రాపిడో డ్రైవర్ ఈ గొడవను గమనించాడు. ఆ మహిళ ఆటోను ధ్వంసం చేసిన వీడియోను రికార్డ్‌ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు షేర్ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆ మహిళ ప్రవర్తనను నెటిజన్లు తప్పుపట్టారు. ఆటోకు జరిగిన నష్టానికి సంబంధించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులకు ఈ వీడియో క్లిప్‌ను ట్యాగ్‌ చేశారు. కారు నంబర్‌ ఆధారంగా ఆ మహిళను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు

Original source: ntnews.com
Read more on Kaizer News