Kaizer News

రష్యా శాంక్షన్స్ బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్ పై

రష్యా శాంక్షన్స్ బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్ పై 100% టారిఫ్స్ ఎప్పటి నుంచి అంటే?

· National - India · v6velugu.com

రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026గా పిలుస్తున్న ఈ చట్టం ద్వారా రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం ట్రంప్‌కు లభించింది. ఈ చట్టం ప్రకారం రష్యా చమురు, గ్యాస్‌ను అత్యధికంగా కొనుగోలు చేసే టాప్-5 దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోలులో భారత్, చైనా ప్రధాన దేశాలుగా ఉండటంతో ఈ నిర్ణయం ఈ రెండు దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం భారత్ , చైనాపై 100 శాతం సుంకం విధించినట్లు కాదు.. ఈ చట్టం ట్రంప్‌కు అలాంటి సుంకాలు విధించే అధికారాన్ని కల్పిస్తోంది. చమురు, రక్షణ రంగం ద్వారా రష్యా యుద్దానికి కావాల్సిన నిధులు సమకూర్చుకుంటుదని ఆమెరికా ఆరోపిస్తోంది. త్వరతో షాడో ప్లీట్ పై కూడా కొత్త ఆంక్షలు ఉంటాయని కొత్త చట్టం రూల్స్ చెబుతున్నాయి. ఇరాన్ పై ఇప్పటికే ఉన్న కొన్ని ఆంక్షలను కూడా ఈ చట్టం పొడిగిస్తుంది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సంబంధిత సుంకాలను 30 రోజుల్లో విధించే అవకాశం ఉన్నప్పటికీ, ఏ దేశాలపై ఎంత మేర సుంకాలు విధించాలనే విషయంలో ట్రంప్‌కు విస్తృత అధికారాలు ఉన్నాయి. జాతీయ భద్రతా కారణాలతో కొన్ని సుంకాలు లేదా ఆంక్షలను మినహాయించే అవకాశం కూడా చట్టంలో ఉంది. ఈ నిర్ణయంతో భారత్-అమెరికా, చైనా-అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చ మొదలైంది. భారత్ ఇప్పటికే కొత్త అమెరికా సుంకాలు ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది

Original source: v6velugu.com
Read more on Kaizer News