Chityala: సే నో టు డ్రగ్స్ – సే నో టు గంజాయి’ నినాదంతో యువతలో చైతన్యం తెచ్చేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమ్రాన్ ప్రిన్స్ బృందం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు చేపట్టిన పాదయాత్ర అభినందనీయమని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ కొనియాడారు. శనివారం చిట్యాల మండలం వేలిమినేడు జాతీయ రహదారి వద్ద పాదయాత్ర బృందానికి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్వాగతం పలికి అభినందించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ యువతను మత్తు పదార్థాల నుంచి దూరం చేసి విద్య, క్రీడలు, ఉపాధి వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గంజాయి అరికట్టేందుకు డివైఎఫ్ఐ నిరంతరం అవగాహన సదస్సులు, సైకిల్ యాత్రలు నిర్వహిస్తోందని తెలిపారు. డ్రగ్స్ దుష్పరిణామాలపై సందేశాత్మకంగా తెరకెక్కించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్’ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు గణేష్, మనోజ్, శివశంకర్, లింగస్వామి పాల్గొన్నారు