Kaizer News

అందరికంటే నేనే గొప్ప అనుకుంది.. చివరికి ఇలా అయింది

అందరికంటే నేనే గొప్ప అనుకుంది.. చివరికి ఇలా అయింది!

· State - Telangana · sakshi.com

పల్లమాల గ్రామంలో చెంగయ్య, బంగారమ్మ అనే రైతు దంపతులు ఉండేవారు. చెరువు కింద ఉన్న మూడు ఎకరాల మాగాణిలో వారు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. నాగలి, కాడి, పట్ర, పార, కొడవలి వంటి వ్యవసాయ పనిముట్లను పని ముగిసిన తర్వాత శుభ్రం చేసి ఒక గదిలో భద్రంగా ఉంచేవారు. రాత్రిళ్లు ఆ పనిముట్లన్నీ తమ యజమాని గురించి మాట్లాడుకునేవి. ‘మన రైతు కష్టానికి తగిన ఫలితం రావాలి’ అని అన్నీ కోరుకునేవి. కానీ కాడికి మాత్రం గర్వం ఎక్కువ. ‘నాగలి, ఎద్దులు ఉన్నా నేను లేకుండా పొలం దున్నలేరు. అందరిలో ముఖ్యమైనది నేనే!’ అని విర్రవీగేది. అప్పుడు పట్ర నవ్వుతూ, ‘బంగారమ్మ నీకే పసుపు రాసి బొట్టు పెట్టి నమస్కరిస్తుంది. నీ విలువ అందరికంటే ఎక్కువ కదా!’ అని అంది. ‘అది నాకిచ్చే గౌరవం కాదు. ఎద్దుల మెడకు గాయాలు కాకూడదనే వారి జాగ్రత్త అంతే!’ అని కాడి నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. మిగతా పనిముట్లన్నీ రైతు కష్టం, పంటల గురించి మాట్లాడుతుంటే, కాడి మాత్రం, ‘ఇకపై కష్టపడను. ఎప్పటికీ ఈ గదిలో హాయిగా విశ్రాంతి తీసుకునే ఉపాయం నాకు తెలుసు, తొందరలో చేసి చూపిస్తాను’ అని చెప్పింది. ఒక రోజు కాడి దుక్కి దున్నుతున్న సమయంలో ముందు చెప్పినట్లే చేసింది. కావాలనే రెండుగా విరిగి పోయింది. చెంగయ్య దానిని గదిలో పెట్టి, కొత్త కాడిని తయారు చేయించుకున్నాడు. ‘ఇప్పుడు నాకు శ్రమ లేదు!’ అని కాడి సంతోషపడింది. కానీ మిగతా పనిముట్లు దాని మూర్ఖత్వానికి బాధపడ్డాయి. కొన్ని రోజుల తర్వాత భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజు చెంగయ్య, ‘ధనయ్యా! గదిలో ఉండే విరిగిన కాడిని తీసుకురా. భోగి మంటలో వెయ్యి, బాగా మండుతుంది’ అన్నాడు. ధనయ్య కాడిని భోగి మంటల్లో వేశాడు. మంటలు ఎగసి పడుతుండగా, గర్వంతో పని చేయకుండా తప్పించుకోవాలని చూసిన కాడి తన తప్పు తెలుసుకుంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. మంటల్లో కాలిపోతున్న దాన్ని చూసి మిగిలిన పనిముట్లన్నీ మౌనంగా బాధపడ్డాయి. అలా కాడి అలిగింది. భోగిలో కాలింది. - పేరూరు బాలసుబ్రమణ్యం ఇదీ చదవండి: ఇంటర్వ్యూలో సెలెక్ట్‌.. కానీ ఉద్యోగం ఇవ్వలేదు! కారణం తెలిస్తే షాకే! కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) ఫ్లైఓవర్ పై నుంచి పడిన BMW.. కారు తుక్కు తుక్కు టీమిండియాకు మరో తలనొప్పి.. ఆసియా గేమ్స్ లో నఖ్వీ ఎంట్రీ... వెయ్యేళ్ల ప్రళయం.. ముంచెత్తబోతున్న రాకాసి జలపాతం! కాకా కేక పెట్టిస్తాది..! విశ్వంభర గురించి చెప్పలేను ఆ బూత్ బంగ్లా నుంచి డెడ్ బాడీ.. సాయి కృష్ణ కేసుపై అడ్వకేట్ రజిని షాకింగ్ నిజాలు

Original source: sakshi.com
Read more on Kaizer News