Kaizer News

తాడిపూడి కాలువలో పడి యువకుడి మృతి

· State - Telangana · sakshi.com

దేవరపల్లి: గోపాలపురం మండలం చిట్యాల వద్ద శనివారం తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువలో పడి యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన యువకుడు దేశాబత్తుల ప్రసాద్‌ (38) శనివారం ఉదయం గోపాలపురం మండలం పెద్దాపురంలోని బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లాడు. చిట్యాల వద్ద తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ సమీపంలో బైక్‌ అదుపు తప్పడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో కాలువలో గాలించి యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహమణ్యం తెలిపారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News