Kaizer News

ట్రాక్టర్‌పై నుంచి పడి యువకుడు మృతి..

ట్రాక్టర్‌పై నుంచి పడి యువకుడు మృతి..

· State - Telangana · prabhanews.com

బూర్గంపాడు, ఆంధ్రప్రభ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం ఉప్పుశాఖ పంచాయతీ పరిధిలోని జిన్నెగట్టు గ్రామంలో ఆదివారం విషాద ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొన్నెం శివాజీ అనే యువకుడు ట్రాక్టర్‌ నుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్రంగా గాయప‌డ్డాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన శివాజీని వెంటనే ఆస్ప‌త్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో జిన్నెగట్టు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News