Kaizer News

రాఖీ పండుగ కోసం వచ్చి కానరాని లోకాలకు.. అందరూ చూస్

రాఖీ పండుగ కోసం వచ్చి కానరాని లోకాలకు.. అందరూ చూస్తుండగానే.. కమ్మేసిన రాకాసి అల..!

· State - Telangana · tv9telugu.com

కుటుంబ సభ్యులతో సరదాగా విహారానికి యారాడ తీరానికి వెళ్లిన యువకుడు.. కెరటాల్లో చిక్కుకుని గల్లంతయ్యాడు. రోజంతా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. దీంతో.. ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవిరల్‌ సింగ్‌.. తన తల్లితో కలిసి రాఖీ పండగ కోసం విశాఖ వచ్చాడు. మల్కాపురం సమీపంలోని నౌసేనాబాగ్‌లో ఉంటున్న మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడ సరదాగా గడిపిన తరువాత ఆదివారం (ఆగస్టు 30) కావడంతో బంధువులు ఎనిమిది మంది కలిసి యారాడ బీచ్‌కు విహారానికి వెళ్లారు. తీరంలో అంతా కలిసి.. ఆనందంగా గడిపిన అనంతరం ఒక్కొక్కరుగా సముద్ర స్నానాలకు దిగారు. అవిరల్‌ సింగ్‌ కాస్త ముందుకు వెళ్లి సాన్నం చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద అల సముద్రంలోకి లాక్కెళ్ళిపోయింది. కళ్ళముందే.. సముద్రంలో మునిగిపోతున్న యువకుడిని చూసి బంధువులంతా పెద్దగా కేకలు వేశారు. స్పందించిన సమీపంలోని గజ ఈతగాళ్లు గాలించినా ఫలితం లేదు. స్థానికులు న్యూపోర్టు పోలీసులకు సమాచారం అందించడంతో వారు తీరానికి చేరుకుని కోస్ట్‌గార్డు, నేవీ సహకారంతో తొలి రోజాంతా గాలింపు చర్యలు చేపట్టినా ఆవిరల్ సింగ్‌ ఆచూకీ తొలిరోజు లభ్యం కాలేదు. సోమవారం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. అవిరల్ సింగ్ కోసం తీరంలో ఎదురు చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది కుటుంబం. మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Original source: tv9telugu.com
Read more on Kaizer News