Kaizer News

Proddatur: ప్రొద్దుటూరు నేతాజీ నగర్‌లో మహిళలకు రంగ

Proddatur: ప్రొద్దుటూరు నేతాజీ నగర్‌లో మహిళలకు రంగవల్లుల పోటీలు!

· State - Telangana · hmtvlive.com

Shorts Proddatur: ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని నేతాజీ నగర్ 2వ వీధిలో వినాయక చవితి వేడుకలలో భాగంగా శ్రీ గజముఖ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహిళా మణులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 45 మంది మహిళలు ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. మహిళా మణులు వేసిన ముగ్గులు అందరిని ఆకట్టుకున్నాయి ఈ ముగ్గుల పోటీలలో న్యాయ నిర్ణయితలుగా మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ సతీమణి తూతిక శైలజ, మెప్మా అధికారి మహాలక్ష్మి లు న్యాయ నిర్ణయతలుగా నిలిచారు. ఈ ముగ్గుల పోటీలను పరిశీలించి ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులకు ఎంపిక చేశారు. ఈ ఎంపికైన వారికి శనివారం మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా తూతిక శైలజ, మహాలక్ష్మి లు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మహిళా మణులకు రంగవల్లుల పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గజముక ఉత్సవ కమిటీ సభ్యులు ప్రవళిక రేష్మ లక్ష్మి మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News