Kaizer News

ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

· State - Telangana · ntnews.com

ఉద్యోగం కోల్పోయిన మనస్తాపంతో బలవన్మరణం కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 : కామారెడ్డిలో ఆర్టీసీ డ్రైవర్‌ ఉరేసుకొని ఆత్మహ త్య చేసుకున్నా డు. దేవునిపల్లి ఎస్సై రంజిత్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని కల్కినగర్‌కాలనీలో నివాసం ఉంటున్న సాయిలు (45) ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. మూడు నెలల క్రితం బ్రీతింగ్‌ టెస్టులో పాజిటివ్‌ రావడంతో ఆర్టీసీ అధికారులు సస్పెండ్‌ చేశారు. దీంతో మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. మనస్తాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News