ఏపీలో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్ఎస్కే సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోడౌన్లలోని బియ్యం నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని, ఉల్లి […]