Shorts కరీంనగర్: మేయర్, డిప్యూటీ మేయర్ , స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ రేకుర్తి వెళ్లారు. మోదీ 25 ఏళ్ల ప్రజా పాలనను పురస్కరించుకుని బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రక్తదాన శిబిరం’ ను సందర్శించారు. జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశంతోపాటు పలువురు బీజేపీ నేతలు స్వచ్ఛందంగా రక్తదానం చేయడాన్ని గమనించిన కేంద్ర మంత్రి ఆయా నేతలను అభినందించారు. మోదీ పాలనలో దేశం ఎంతో అభివ్రుద్ధి చెందిందని, ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చారని చెప్పారు. మోదీతోనే దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవడం ఖాయమని, ఈ నేపథ్యంలో నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరించేలా మోదీని ఆశీర్వాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు