Kaizer News

MLA Sunitha Lakshma Reddy | రోడ్డు నిర్మాణం కోసం ఎ

MLA Sunitha Lakshma Reddy | రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాదయాత్ర

· State - Telangana · ntnews.com

అభివృద్ధి పనులను అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కదం తొక్కనున్నారు. రోడ్డు నిర్మాణం కోసం సునీతా లక్ష్మారెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు వెల్దుర్తి నుంచి మెదక్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి నుంచి పిల్లి కొట్టాల, మెదక్ వరకు రోడ్డు నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం 18 లక్షలు మంజూరు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అధికారులు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధులను రద్దు చేసింది. రోడ్డు నిర్మాణం చేపట్టాలని సునీతా లక్ష్మారెడ్డి వెల్దుర్తి నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. Switzerland | స్విట్జర్లాండ్ రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు వైభవంగా మార్వాడీల కావడి యాత్ర.. హరిహర మహాదేవ’ నామస్మరణతో సాగిన భక్తుల పాదయాత్ర TVK vs Cong | కాబోయే ప్ర‌ధాని విజ‌య్ అంటూ జోరుగా ప్ర‌చారం.. అధికార కూటిమిలో క‌ల‌క‌లం..!

Original source: ntnews.com
Read more on Kaizer News