Kaizer News

Khammam: సత్తుపల్లిని ఎప్పటికీ మర్చిపోము: డాక్టర్

Khammam: సత్తుపల్లిని ఎప్పటికీ మర్చిపోము: డాక్టర్ తుమ్మల యుగంధర్!

· State - Telangana · hmtvlive.com

Shorts Khammam: 2004వ సంవత్సరం నుండి మా నాన్నగారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ నుండి పోటీ చేసే అవకాశం లేకపోయినా మంత్రి తుమ్మల గారు ఆలోచన సత్తుపల్లి అంటే అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందు ఉండాలి అనేది ఆయన ఆకాంక్ష అని డాక్టర్ తుమ్మల యుగంధర్ గారు తెలిపారు. శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు రాత్రి జరిగిన గణేష్ ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశాంగించారు.ఈ ప్రసంగంలో డాక్టర్ తుమ్మల యుగంధర్ భావొద్వేగానికి లోనై మా కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి ప్రాంత ప్రజలు రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము అని, సత్తుపల్లి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మేము పనిచేస్తామని డాక్టర్ తుమ్మల యుగంధర్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తుమ్మల యుగంధర్ గారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు తో పాటు కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, తుమ్మల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News