Kaizer News

Hanamkonda: స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించిన వరంగల

Hanamkonda: స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

· State - Telangana · hmtvlive.com

హనుమకొండ: బాలసముద్రంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (DSA) ఆధ్వర్యంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన స్విమ్మింగ్ పూల్‌ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, క్రీడా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు మౌలిక వసతుల అభివృద్ధి ఎంతో అవసరమని తెలిపారు. స్విమ్మింగ్ వంటి క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఎంపీ తెలిపారు. ఈ స్విమ్మింగ్ పూల్‌ను క్రీడాకారులు, యువత సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News