Kaizer News

Tirupati: పీఆర్ మోహన్ కుమార్తె వివాహానికి హాజరైన స

Tirupati: పీఆర్ మోహన్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు!

· State - Telangana · hmtvlive.com

తిరుపతి: తిరుపతి జిల్లా సీఆర్ఎన్ కండ్రిగ గ్రామంలో జరిగిన దివంగత శాప్ మాజీ ఛైర్మన్, టీడీపీ నేత పీఆర్ మోహన్ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వివాహ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై వధూవరులు డింపుల్, రాజేష్‌లను ఆశీర్వదించారు. నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పీఆర్ మోహన్ కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడారు. వివాహ వేడుకకు హాజరైన పలువురు టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. సీఎం రాకతో సీఆర్ఎన్ కండ్రిగలో సందడి నెలకొంది. వివాహ వేడుకకు వచ్చిన అతిథులు, పార్టీ శ్రేణులు చంద్రబాబుతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ముఖ్యమంత్రి నూతన దంపతులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమం నుంచి బయలుదేరారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News