Kaizer News

Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..

· National - India · ntvtelugu.com

పాకిస్థాన్‌, తాలిబాన్‌ల మధ్య విభేదాలు మళ్లీ తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక భారీ తీవ్రవాద దాడి తర్వాత, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌కు నేరుగా గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాద దాడులను నెపంగా చూపి పాకిస్థాన్‌ గనుక ఆఫ్ఘనిస్థాన్‌ భూభాగంలోకి ప్రవేశించి సైనిక చర్యలకు దిగితే, తమ దేశ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సరిహద్దులను కాపాడుకోవడానికి ఎంతటి తీవ్రమైన నిర్ణయానికైనా వెనుకాడమని తాలిబాన్ స్పష్టం చేసింది. తమ భూభాగంపై ఎలాంటి దాడి జరిగినా దానికి తగిన రీతిలోనే గట్టి సమాధానం ఇస్తామని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు, పాకిస్థాన్‌లో జరుగుతున్న వరుస రక్తపాతాలకు ఆఫ్ఘన్ భూభాగం నుంచే కుట్రలు జరుగుతున్నాయని ఇస్లామాబాద్ సుదీర్ఘకాలంగా ఆరోపిస్తోంది. ఈ పరస్పర ప్రతిసవాల్‌లతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నాయి

Original source: ntvtelugu.com
Read more on Kaizer News