కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తాలో ట్రాఫిక్ ఔట్ పోస్టులు ప్రారంభం కరీంనగర్ క్రైమ్, (ఆంధ్రప్రభ) : నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడంతోపాటు నిరంతరం పర్యవేక్షించేందుకు ఔట్ పోస్ట్‌లు ఉపయోగపడతాయన్నారు. ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, ఎస్‌ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు