ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్-2026లో సర్రే క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత స్పిన్నర్ రాహుల్ చాహర్.. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం చెల్మ్స్‌ఫోర్డ్ వేదికగా ఎసెక్స్ క్లబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చాహర్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో చాహర్ 6 వికెట్లు పడగొట్టి ఎసెక్స్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బ తీశాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకుని ఎసెక్స్ బ్యాటర్లు విలవిల్లాడారు. దీంతో ఎసెక్స్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ డీన్ ఎల్గర్(113) మినహా మిగితా ప్లేయర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. కాగా 27 ఏళ్ల చాహర్ భారత తరపున చివరగా 2021లో శ్రీలంకపై ఆడాడు. ఆ తర్వాత అతడు మెరుగ్గా రాణించికపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఒకప్పుడు ఐపీఎల్‌లో ప్రతీ మ్యాచ్‌లో ఆడిన చాహర్.. గత కొన్ని సీజన్లగా ఎక్కువగా బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాహుల్.. కేవల ఒకే మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కూడా తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్ కౌంటీల్లో మెరుగ్గా రాణించి భారత జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. చదవండి : క్రికెట్ చరిత్రలోనే అత్యుద్భుతం.. 1932 తర్వాత నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) బాబు బుద్ధులే కొడుక్కి వచ్చాయి... నువ్వు ఓ పిరికిపందవి... ఉతికారేసిన కారుమూరి ఇరుముడి సక్సెస్ తో జాక్పాట్...హీరో, డైరెక్టర్ కు ఆఫర్ల వర్షం! ఎక్కడికి పోయావ్ అయ్యా పవన్ కళ్యాణ్.. నిన్ను ఎమ్మెల్యే చేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి