Kaizer News

గాయంతో కీలక బ్యాటర్‌ ఔట్‌.. ఓటమి దిశగా పాకిస్తాన్‌

గాయంతో కీలక బ్యాటర్‌ ఔట్‌.. ఓటమి దిశగా పాకిస్తాన్‌

· Sports · sakshi.com

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. కానీ పాక్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఇమామ్‌-ఉల్‌-హక్ రెండో టెస్టుకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ విధించిన 389 పరుగులు టార్గెట్‌ను పాకిస్తాన్ ఛేదిస్తుందా లేక చతికిలపడుతుందా అన్నది పక్కనబెడితే, ఇమామ్‌ ఉల్ హక్ బ్యాటింగ్‌కు రాకపోతే అప్పుడు పాక్‌ పది మంది బ్యాటర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఇది పాక్‌కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఆట తొలిరోజే ఇమామ్‌ గాయపడడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. అయితే స్కానింగ్‌లో ఎడమ తొడ కండరాల్లో చీలిక వచ్చినట్లు తేలింది. ఇది గ్రేడ్ -1 టియర్‌గా వైద్యులు పరిగణించారు. దీంతో ఇమామ్-ఉల్-హక్‌కు పది రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అయితే ఇమామ్ ఉల్ హక్ గాయం విషయమై పీసీబీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే మేనేజ్‌మెంట్ మాత్రం రిస్క్ తీసుకోవద్దనే భావిస్తోంది. దీంతో ఇమామ్ ఉల్ హక్ సిరీస్‌లో చివరి టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దగా ఫామ్‌లో లేకపోయినప్పటికీ, స్పెషలిస్ట్ బ్యాటర్‌గా పేరున్న ఇమామ్ గాయంతో దూరమవ్వడం పాక్‌కు ఇబ్బంది కలిగించనుంది. రెండో టెస్టులో 10 మందితోనే ఆడాల్సి ఉంటుంది. వెస్టిండీస్‌తో సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు కలిపి కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్‌, రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్‌ 208 ఆలౌట్‌.. ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటైంది. డాన్ లారెన్స్ (54) అర్ధసెంచరీ సాధించగా, హ్యారీ బ్రూక్ (34), ఎమియో గే (31), రూట్ (24) పర్వాలేదనిపించారు. మొహమ్మద్ అబ్బాస్ 5 వికెట్లు తీయగా, ఖుర్రమ్, మొహమ్మద్ అలీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో పాకిస్తాన్ ముంగిట 389 పరుగుల లక్ష్యం విధించింది. ఛేదనలో పాకిస్తాన్ తడబడుతోంది. 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఓటమి దిశగా పయనిస్తోంది. అంతకముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్‌ కాగా, పాకిస్తాన్‌ 110 పరుగులకే కుప్పకూలింది. Read: ‘నోబాల్‌ వేస్తే ఫ్రీ హిట్‌ కాదు.. కఠిన శిక్షలు వేయాలి’ హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News