రాయపర్తి, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి దాటుతున్న గారె వీరయ్య (55)ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం వాహనం ఆగకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు