అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు విడుదల చేశారు. బదిలీ అయిన అధికారుల్లో పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL) డైరెక్టర్‌గా త్రివిక్రమ్ వర్మను నియమించారు. సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా జయలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. రైల్వే ఐజీగా బి. రాజకుమారిని నియమించడంతో పాటు, సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ సేఫ్టీ ఐజీగా కాంతి రాణాకు పోస్టింగ్ ఇచ్చారు. ఇటీవలే ఆమె సస్పెన్షన్ నుంచి తిరిగి వచ్చారు. ట్రైనింగ్ డీఐజీగా విశాల్ గున్నికి బాధ్యతలు అప్పగించారు. టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా బాబూజీ అట్టాడ నియమితులయ్యారు. ఇక జిల్లాల స్థాయిలోనూ మార్పులు చేశారు. మార్కాపురం జిల్లా ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, పోలవరం జిల్లా ఎస్పీగా కె. చక్రవర్తి, పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీశ్ అదహళ్లిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది