ముంబై లాల్‌బాగ్‌లో విషాద ఘటన.. పలువురికి గాయాలు గణపతి ఉత్సవాలకు భారీగా తరలివచ్చిన జనం ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గణపతి ఉత్సవాల వేళ ముంబైలో విషాద ఘటన చోటుచేసుకుంది. లాల్‌బాగ్ ప్రాంతంలోని గణపతి మండపం సమీపంలో విద్యుత్ షాక్‌కు గురై ఎనిమిదేళ్ల బాలిక సహా ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో కలాచౌకీ ప్రాంతంలోని దత్తారామ్ లాడ్ మార్గ్‌లో ఈ ఘటన జరిగింది. గణపతి ఉత్సవాల నేపథ్యంలో ఈ ప్రాంతానికి భారీ సంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలివచ్చిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కలాచౌకీ విభాగ్ సార్వజనిక్ ఉత్సవ్ మండల్ సమీపంలో విద్యుత్ షాక్ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, గాయపడిన వారి పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది