Kothagudem: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, పాల్వంచ డివిజన్ పరిధిలో ఔట్ సోర్సింగ్ విధానంలో 199 మంది సిబ్బంది పబ్లిక్ హెల్త్ వర్కర్లు, డ్రైవర్లు, సూపర్ వైజర్లు, వాచ్ మెన్ లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లుగా గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల CDMA ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ సిబ్బంది వివరాలు, అర్హతలు, వారు చేసే పని, పొందే జీతం వివరాలతో మ్యాపింగ్ చేయించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, సూపర్ వైజర్లను స్కిల్డ్ కేటగిరీగా చూపించారు. కానీ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం మ్యాపింగ్ లో వీరిని అన్ స్కిల్డ్ గా చూపించడం వల్ల ఒక్కొక్కరికి నెలకు రూ.4,500/- వేతనం తగ్గిపోయింది. వీరందరూ ITI అర్హత కలిగి ఉండి, GO No.14 ప్రకారం గతంలో సెమీ స్కిల్డ్ / స్కిల్డ్ వేతనం పొందుతున్నారు. కావున CDMA కమిషనర్ గారు, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకుని, రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలలో మాదిరిగానే కొత్తగూడెంలో కూడా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, సూపర్ వైజర్లను స్కిల్డ్ గా గుర్తించి తగ్గిన వేతనాన్ని పునరుద్ధరించాలని సిబ్బంది కోరుతున్నారు