Kaizer News

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బ​కు 57 ఏళ్ల రికార

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బ​కు 57 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్‌

· Sports · sakshi.com

బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్‌జోన్ తాత్కాలిక కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ యువ సంచలనం.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. 15 ఏళ్ల వైభవ్‌ టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేస్తూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ​మొత్తంగా 92 పరుగులు చేసి తన ఫస్ట్‌క్లాస్‌ సెంచరీని తృటిలో చేజార్చకున్నాడు. కాగా ఈ ఫైరీ ఫిప్టీతో సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల 157 రోజుల వయస్సులో సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత లెజెండరీ క్రికెటర్ లక్ష్మణ్ సింగ్ పేరిట ఉండేది. అతడు 1969లో 16 ఏళ్ల 23 ఏళ్ల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో 57 ఏళ్ల లక్ష్మణ్ సింగ్ రికార్డ్‌ను వైభవ్ బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్‌ 25 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజులో అభిమన్యు ఈశ్వరన్‌(53), ఎస్‌ కుమార్‌(4) ఉన్నారు. అంతకుముందు సెంట్రల్‌ జోన్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. పేస్ బౌలర్లు ముకేశ్ కుమార్, అభిజిత్ కె. సర్కార్ తలా మూడు వికెట్లతో సత్తా చాటారు. వీరితో పాటు మహమ్మద్ షమీ, ఖురేషీ చెరో రెండు వికెట్లు తీశారు. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో రింకూ సింగ్ (88 బంతుల్లో 60) అర్ధశతకంతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆర్యన్ జుయల్ (46), యశ్ ఠాకూర్ (30) పర్వాలేదనిపించారు. చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ప్రపంచ రికార్డ్‌ బ్రేక్‌ వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ! Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) లైవ్ లో మల్లెపూల పల్లకి పాటతో పూనకాలు తెప్పించిన ఇరుముడి సింగర్ డప్పు శీను నేనే ధీరుడిని.. పోటుగాడిని అనుకున్నాడు.. YSRCP నుండి బయటకు వెళ్ళాక సీన్ అర్థమైంది ఇరాన్ ఆర్థిక మూలాలపై ట్రంప్ వేట.. బ్యాంక్ మిస్ర్ కు బిగ్ షాక్! నన్ను కొట్టి ఫోన్ లాక్కొని.. బీజేపీ రవిప్రకాష్ కిడ్నాప్ పై భార్య సంచలన కామెంట్స్

Original source: sakshi.com
Read more on Kaizer News