Kaizer News

క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం

క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం

· Sports · prabhanews.com

ఏళ్లు దాటిన వారి ఉత్సాహం స్ఫూర్తిదాయకం.. రూరల్‌ సీఐ హనోక్‌ జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన ఘనత బెల్లంపల్లిది: రిటైర్డ్‌ అదనపు ఎస్పీ పులియాల రవికుమార్‌ బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : నిత్యం శారీరక వ్యాయామం చేయడంతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసికోల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని బెల్లంపల్లి రూరల్‌ సీఐ హనోక్‌ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని తిలక్‌ క్రీడా మైదానంలో ఆదివారం తిలక్‌ వాకర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ పోటీలను సీబీసీఐడీ రిటైర్డ్‌ అదనపు ఎస్పీ పులియాల రవికుమార్‌, వన్‌టౌన్‌ ఎస్సై రామకృష్ణతో కలిసి రూరల్‌ సీఐ హనోక్‌ ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ 50 ఏళ్లు పైబడిన వారు నవ యువకుల్లా ఉత్సాహంగా, చురుగ్గా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవన విధానంలో ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బెల్లంపల్లి పట్టణం ఆదినుంచీ క్రీడలకు పెట్టింది పేరని రిటైర్డ్‌ అదనపు ఎస్పీ పులియాల రవికుమార్‌ అన్నారు. తిలక్‌ మైదానంలో సాధన చేసిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణించి పట్టణ ఖ్యాతిని నలుదిశలా చాటారని గుర్తుచేశారు. ఎంతో మందిలో క్రీడా స్ఫూర్తిని రగిలించిన చారిత్రాత్మక తిలక్‌ క్రీడా మైదానాన్ని ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. మైదానాన్ని ఆధునీకరిస్తే భవిష్యత్‌ తరాల యువత క్రీడల్లో మరింతగా రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. క్రీడా పోటీల్లో భాగంగా సీనియర్‌ సిటిజన్లు, వాకర్స్‌ కోసం స్పీడ్‌ వాక్‌, రన్నింగ్‌, షాట్‌పుట్‌, తాడులాగుడు తదితర పోటీలు నిర్వహించారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. క్రీడారంగానికి విశేష సేవలందించిన సీనియర్‌ క్రీడాకారులు యాదండ్ల నర్సయ్య, తోట పోచన్న, మాదాసి గోపాల్‌, గోవర్ధన్‌లను సంఘం తరఫున శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. పోటీల నిర్వహణలో కీలక పాత్ర పోషించి సాంకేతిక సహకారం అందించిన పీఈటీలు రాజ్‌ మహమ్మద్‌, బండి రవి, చంద్‌ పాషాలను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో తిలక్‌ వాకర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రంగ రామన్న, ప్రధాన కార్యదర్శి కంటేవాడ నగేష్‌, కోశాధికారి కజ్జం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News