Kaizer News

Cherial: ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్ ఆవిష్

Cherial: ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

· State - Telangana · hmtvlive.com

చేర్యాల: విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం యువత పోరాడాలని ఏఐవైఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 8,9,10 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్‌ రాష్ట్ర 3వ మహాసభల వాల్ పోస్టర్లను శనివారం చేర్యాల పట్టణంలోని సంఘం కార్యాలయంలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శాశ్వత ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై స్పష్టమైన హామీలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలకు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా నాయకులు గూడెపు సుదర్శన్, మండల అధ్యక్షులు కాశబోయిన చరణ్, మండల ప్రధాన కార్యదర్శి బోడపట్ల రాజు, ఉపాధ్యక్షులు బాపు అక్షయ్, గిద్దెల రాజు, తుడూమ్ నర్సింగరావు, బాలకృష్ణ, లింగం, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News