హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు నిద్రలేవగానే దేవుడి పటమో.. లేదంటే అమ్మానాన్నల మొఖమో చూసేవాళ్లు. కానీ, ఇప్పుడు ఫోన్ చూడడం వ్యసనంగా మారిపోయింది. బ్రష్ చేస్తున్నా, బాత్రూంకు వెళ్లినా, జర్నీ చేస్తున్నా, బైక్ లేదా కార్ నడుపుతున్నా మొబైల్ ఫోన్ చూడడం అలవాటైంది. ఎంతలా అంటే.. ఒక్క క్షణం ఫోన్ కనిపించలేదంటే ప్రాణం ఆగమాగమైపోయేంతలా తయారైంది. ఫోన్ కనిపించకపోవడమేకాదు.. బ్యాటరీ చార్జింగ్ అయిపోవచ్చినా, నెట్ కాసేపు ఆగినా టెన్షన్పుడుతున్నది. దీన్నే నో మొబైల్ ఫోబియా (నోమో ఫోబియా) అని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా దీని బారిన పడ్డారు. ఇది ముదిరిపోతే మానసిక, శారీరక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే మొబైల్ ఫోన్‌ను ఎంతలో ఉంచాలో అంతల్నే ఉంచాలని సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ నోమో ఫోబియాను 2008లోనే గుర్తించారు. బ్రిటన్‌కు చెందిన పోస్టాఫీస్ అనే సంస్థ మొబైల్ యూజర్ల ఆందోళనలపై అధ్యయనం చేసినప్పుడు తొలిసారి నోమో ఫోబియా అని పిలిచారు. ఇప్పుడు 5జీ ఇంటర్నెట్ యుగంలో.. స్మార్ట్ఫోన్ల కాలంలో అది మరింత ఎక్కువైపోయింది. ముఖ్యంగా పిల్లలు, యుక్తవయసుకు వచ్చిన వారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. డిజిటల్ వినియోగానికి సంబంధించి మన దేశం ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంది.ఒక్కో వ్యక్తి సగటున రోజూ ఆరు గంటల పాటు మొబైల్‌ను చూస్తూనే గడిపేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఆన్లైన్ గేమింగ్స్, రీల్స్ కోసమే ఎక్కువ వినియోగిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఆ ట్రెండ్ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ వంటి పట్టణాలతో మామూలు పల్లెలకు పాకింది. ఐటీ ఉద్యోగుల్లో అయితే.. ఫియర్ఆఫ్ మిస్సింగ్ అవుట్ (ఫోమో) అనే మరో యాంగ్జైటీ కూడా విస్తరిస్తున్నదని చెబుతున్నారు. ఆఫీస్ మెయిల్స్, మెసేజ్‌లు, టీమ్స్ చాట్‌లు ఎక్కడ మిస్ అవుతామోనన్న భయంతో 24 గంటలూ స్క్రీన్‌ను అంటిపెట్టుకుని ఉంటున్నారని అంటున్నారు. పల్లెటూరి యువత సైతం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌కు బానిసలవుతున్నారు. వ్యవసాయ పనుల్లో ఉన్నా, టీ కొట్టు వద్ద కూర్చున్నా తలలు వంచి ఫోన్లలోకి చూడటం సాధారణంగా మారిపోయింది. నోమోఫోబియా కేవలం మానసిక సమస్య మాత్రమే కాకుండా.. శారీరక సమస్యలకూ దారితీస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేపనిగా ఫోన్ పట్టుకుని ఉండడం వల్ల మొబైల్ మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్‌తో శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతున్నదని, దాని వల్ల నిద్రలేమి సమస్య ముదురుతున్నదని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను అదే పనిగా తలొంచి చూడడం వల్ల మెడ, వెన్నుపూస దెబ్బతింటాయని చెబుతున్నారు. దానినే ‘టెక్స్ట్ నెక్’ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఇతరుల సంతోషాన్ని చూసి.. తమతో పోల్చుకుంటూ ఆత్మన్యూనతకు గురువుతున్నట్టు చెబుతున్నారు. అదే చినికిచినికి డిప్రెషన్‌లా మారి తీవ్రంగా మారిపోతున్నట్టు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు కాసేపు ఫోన్ కనిపించకుంటే అరవడం, కోపం పెంచుకోవడం, ఎదుటివా