అనంతగిరి: తెలంగాణలో రూ.80వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన అమృత్ భారత్ పథకం కింద కొనసాగుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో 42 స్టేషన్‌లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు రూ.24.35 కోట్లతో ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్, లిఫ్ట్‌లు, ఆధునిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూ.720 కోట్లతో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రైల్వే ప్రమాదాల నివారణకు రాష్ట్రాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి కవచ్ టెక్నాలజీని అమలు చేస్తున్నారన్నారు. స్వదేశీ టెక్నాలజీతో ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించుకున్నామని, ప్రయాణికులు పూర్తిస్థాయిలో ఆదరిస్తున్నారన్నారు. రూ.5లక్షల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో మూడు బుల్లెట్ ట్రైన్‌లు పురుడు పోసుకుంటున్నాయన్నారు. అభివృద్ది చెందిన రాష్ట్రాలలో తెలంగాణ అగ్రభాగాన ఉండబోతుందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి వికారాబాద్ రైల్వే పునర్నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు. బీజాపూర్ హైవే పనులు వేగిరం చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రైల్వే డీఆర్‌ఎం డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ దీపక్‌తివారి, అడిషనల్ ఎస్పీ రాజేశ్ మీనా తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే ఇన్ని వంకర్లా?: కిషన్‌రెడ్డి చేవెళ్ల: ‘నేషనల్ హైవే అంటే నేరుగా ఉండాలి.. ఇన్ని వంకర్లతో రోడ్డు వేయడం ఏమిటి.. హైవే పక్కన సర్విస్ రోడ్డు వేయకపోతే రైతులు ఎలా వెళ్తారు.. ఎవరు ఇలా డిజైన్ చేసింది’అంటూ హైవే అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మల్కాపూర్ వద్ద ఆదివారం హైదరాబాద్–బీజాపూర్ హైవే రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే అధికారులతో మాట్లాడారు. పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత రహదారిలో ఎన్ని వంకర్లు ఉన్నాయో కొత్త దారి నిర్మాణంలోనూ అదే తరహా వంకర్లు ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ఇన్ని మలుపులుంటే ప్రమాదాలు జరగవా? అని నిలదీశారు. రోడ్డు పక్కన మర్రిచెట్ల కోసం ఇలా జరిగిందని అధికారులు సమాధానం చెప్పేందుకు ప్రయతి్నంచారు. చెట్లపేరుతో రోడ్డు వంకర్లు, సర్వీస్ రోడ్డు లేకుండా చేయడమేమిటని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దీనిపై అధికారులతో సమీక్షిస్తానని అధికారులంతా తరువాత కలవాలన్నారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు