Kaizer News

GDN Movie OTT : మాధవన్ GDN మూవీ ఓటీటీ రిలీజ్ డేట్

GDN Movie OTT : మాధవన్ GDN మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

· Entertainment · telugu.abplive.com

మిరాకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎడిసన్‌గా పేరుగాంచిన గొప్ప ఆవిష్కర్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (GDN). సౌత్ ఇండియాలో ఓ వాణిజ్య విప్లవాన్ని తీసుకొచ్చిన ఆయన రియల్ లైఫ్ స్టోరీతో రూపొందించిన చిత్రమే GDN. కోలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ ఈ మూవీలో టైటిల్ రోల్ పోషించారు. ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. 'GDN' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా... సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి రానుందని సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ మూవీకి కృష్ణకుమార్ రామ్ కుమార్ దర్శకత్వం వహించగా... మాధవన్, కృష్ణకుమార్ రామ్ కుమార్ స్క్రీన్ ప్లే అందించారు. మాధవన్‌తో పాటు దుషార విజయన్, జయరామ్, ప్రియమణి, సత్యరాజ్, కరుణాకరన్, వినయ్ రాయ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. గోవింద్ వసంత మ్యూజిక్ అందించారు. ైతు కుటుంబంలో జన్మించిన జిడి నాయుడు (మాధవన్) చదువు మూడో తరగతితోనే ఆగిపోతుంది. డిగ్రీల కంటే తెలివితేటలు, నేర్చుకోవాలన్న తపనే ఇంపార్టెంట్ అని ఆయన నమ్మకం. ఈ క్రమంలో కొత్త ఆవిష్కరణలపై ఫోకస్ చేస్తాడు. ఆంగ్లేయుల కాలంలో బ్రిటిషర్ దగ్గర మోటర్ సైకిల్ కొనుగోలు చేసి అదెలా వర్క్ చేస్తుందో తెలుసుకుంటాడు. సొంత ఆలోచనతో మరో వాహనాన్ని తయారుచేస్తారు. అలా, ఎన్నో వస్తువులతో పాటు ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ తయారు చేస్తారు. ఓ బస్సును కొని కొన్నేళ్ల పాటు స్వయంగా నడిపి, 600 వాహనాలతో కూడిన యునైటెడ్ మోటార్ సర్వీసెస్‌ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తారు. ఇండియాలో ఫస్ట్ పాలిటెక్నిక్ కాలేజీ స్థాపిస్తారు. GDN అలా ఎదుగుతుండడం బ్రిటిషర్స్, కొంతమంది బిజినెస్ మ్యాన్స్‌కు కంటగింపుగా మారుతుంది. ఆయన్ను ఇబ్బంది పెట్టాలని... అధికంగా ట్యాక్సులు వేసి, అధికారులను ఆయనపై ఉసిగొల్పుతారు. దేశ ద్రోహి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తారు. మరి వారి ఎత్తుగడల్ని GDN ఎలా తిప్పికొట్టారు? భార్య రంగనాయకి (దుషార విజయన్), ఆయన గురించి తెలిసిన ప్రజలు ఎలా తోడుగా నిలిచారు? మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next డబ్బున్నోడే ఇక్కడ కింగ్ - నాగ్ బర్త్ డే స్పెషల్... కొత్త మూవీ గ్లింప్స్ వచ్చేసింది హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ నిజామాబ

Original source: telugu.abplive.com
Read more on Kaizer News