Kaizer News

అటవీ భూముల్లో జోక్యం వద్దు

అటవీ భూముల్లో జోక్యం వద్దు

· State - Telangana · ntnews.com

వాటికి పట్టాలిచ్చే అధికారం రెవెన్యూ అధికారులకు లేదు హైకోర్టు స్పష్టీకరణ.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు సమన్లు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ): అటవీ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. అటవీ భూముల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం రెవెన్యూ శాఖకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భూములపై రెవెన్యూ అధికారులకు ఎలాంటి హకులు లేవని వ్యాఖ్యానించింది. అడవులు పర్యావరణానికి ప్రాణవాయువునిచ్చే ఊపిరితిత్తుల్లాంటివని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పేరొన్నది. అటవీ భూములను ఇతర అవసరాలకు మళ్లించడం సరికాదని, వాటిలో ఆక్రమణలను తొలగించాలని తేల్చిచెప్పింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని అటవీ భూముల వ్యవహారంపై శుక్రవారం మధ్యాహ్నం జరిగే విచారణకు కలెక్టర్‌ ఆన్‌లైన్‌ ద్వారా హాజరుకావాలని, జిల్లా అటవీ అధికారితో ఎందుకు చర్చలు జరపడం లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అటవీ భూముల పరిరక్షణ విషయంలో చట్ట నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు స్పష్టం చేసింది

Original source: ntnews.com
Read more on Kaizer News