Kaizer News

గాంధీ జయంతికి తెల్ల కాగితం సినిమా విడుదల

గాంధీ జయంతికి తెల్ల కాగితం సినిమా విడుదల

· Entertainment · v6velugu.com

కోర్ట్, బ్యాండ్ మేళం వంటి చిత్రాలతో గుర్తింపును తెచ్చుకున్న హర్ష్ రోషన్.. హీరోగా నటిస్తున్న యూత్‌‌ఫుల్ ఎంటర్‌‌టైనర్ ‘తెల్ల కాగితం’. నక్షత్ర హీరోయిన్. రమేష్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మొదటి పాట సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌లో హర్ష్ రోషన్, నక్షత్ర జంట ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వర్షం వస్తుండగా, ఓ అరటి ఆకును అడ్డుగా పెట్టుకుని ఉన్న వీరిద్దరి పోస్టర్ సినిమాలోని ప్రేమకథను చూపిస్తోంది. సామజవరగమన, నారి నారి నడుమ మురారి చిత్రాలకు సహ రచయితగా పనిచేసిన నందు సవిరిగాన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు

Original source: v6velugu.com
Read more on Kaizer News