వారం రోజులుగా మాటల తూటాలతో హోరెత్తిన యోగా గురువు రామ్‌దేవ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మధ్య వివాదానికి రక్షాబంధన్ సందర్భంగా తెరపడింది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్న ఈ ఇద్దరూ.. పండగ వేళ విభేదాలను పక్కనపెట్టారు. రామ్‌దేవ్ స్వీట్లు, బహుమతిని .. కంగనా ‘అన్నయ్య’గా అనుకుంటూ తనకు పంపిన స్వీట్లను స్వీకరించారు. ద్వేషానికి చోటుండకూడదంటూ.. ‘దేశంలో కారణం ఏదైనా ద్వేషం ఉండకూడదు. అందరితో స్నేహంగా ఉండాలి. అందకే మా మధ్య ఉన్న విభేదాలను పూర్తిగా పక్కనపెట్టా. ఏ గోడవైనా మాట్లాడుకుంటే పరిష్కారమవుతుంది’ అని రామ్‌దేవ్ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా కంగనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పానని తెలిపారు. అంతేకాకుండా ఓ బహుమతి, స్వీట్లను పంపించినట్లు తెలిపారు. ( ఇదీ చదవండి: రుక్మిణి తండ్రి వెనుక ఇంత చరిత్ర ఉందా..? ) అన్నయ్యగా అంగీకరించిన కంగనా రామ్‌దేవ్ పంపిన స్వీట్లు,బహుమతిని స్వీకరించి దీనిపై కంగనా సానుకూలంగా స్పందించారు. ‘పండగలు తప్పులను మర్చిపోవడానికి నా ‘అన్నయ్య’ రామ్‌దేవ్ పంపిన స్వీట్లను స్వీకరిస్తున్నాను. అన్నయ్యగా ఆయన చూపించిన ప్రేమను, పంపిన బహుమతిని తీసుకుంటున్నాను’ అని కంగనా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకూ సూచన రాజకీయ పార్టీలకు రామ్‌దేవ్ ఓ సలహా ఇచ్చారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం రాఖీలు కట్టుకోవాలన్నారు. అలా చేస్తే సమాజానికి మంచి సందేశం వెళ్తుందని, ఎలాంటి వివక్ష ఉండకూడదనే భావన ప్రజల్లో బలపడుతుందని పేర్కొన్నారు. అసలు గొడవ ఏంటి? జెన్జీల నిరసనకారులను కంగనా ‘గట్టర్ జనరేషన్’గా అభివర్ణించడంపై రామ్‌దేవ్ స్పందించడంతో వివాదం మొదలైంది. ఓ టీవీ కార్యక్రమంలో ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన.. కంగనా అర్హతలు, వ్యక్తిగత జీవితంపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరిద్దరికి మాటల యుద్ధం మొదలైంది. రామ్‌దేవ్ వ్యాఖ్యలపై కంగనా సోషల్ మీడియాలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయొద్దని , రామ్‌దేవ్ హద్దులు దాటుతున్నారని తీవ్రంగా హెచ్చరించారు. ఇదీ చదవండి: 'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే? హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) గురు శిష్యుల చీకటి ఒప్పందంతో రాయలసీమ తాకట్టు.. శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు తాగడానికి నీళ్లు లేవు కానీ.. డ్రగ్స్ మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి చంద్రబాబు పేరు చెప్తుంటే సల సల మండిపోతున్నారు.. మంత్రి నిమ్మలకు చేదు అనుభవం.. చుట్టుముట్టిన మార్కాపురం ప్రజలు