Kaizer News

Kalluru: కల్లూరు వినాయక మండపాల్లో డాక్టర్ మట్టా దయ

Kalluru: కల్లూరు వినాయక మండపాల్లో డాక్టర్ మట్టా దయానంద్ పూజలు

· State - Telangana · hmtvlive.com

Shorts కల్లూరు: వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా కల్లూరు పట్టణంలోని పలు వినాయక మండపాలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సందర్శించారు. ఆయా మండపాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినాయక భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపల్ చైర్మన్ దారావత్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కల్లూరు వేణుగోపాలస్వామి ఆలయం చైర్మన్ దారా రంగా,కల్లూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉస్మాన్ అలీ, కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రు అర్జున్ రావుతో పాటు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News