Kaizer News

Madhya Pradesh | కాలువ‌లోకి దూసుకెళ్లిన కారు.. ముగ

Madhya Pradesh | కాలువ‌లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు చిన్నారులతోస‌హా ఎనిమిది మంది మృతి

· National - India · ntnews.com

Madhya Pradesh : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన ఒక కారు కాలువ‌లోకి దూసుకెళ్ల‌డంతో ఎనిమిది మంది మ‌రణించారు. మృతుల్లో ముగ్గురు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్, అగ‌ర్ మాల్వా జిల్లాలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత‌ జ‌రిగింది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాల్ని పోలీసులు వెల్ల‌డించారు. ఒడిశాకు చెందిన కొంద‌రు భ‌క్తులు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉన్న న‌ల్ఖేదా ప‌ట్ట‌ణంలోని బ‌గులాముఖి ఆల‌యానికి వెళ్లేందుకు ఒక కార్ బుక్ చేసుకున్నారు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి కారులో వెళ్తుండ‌గా అగ‌ర్ మాల్వా జిల్లా ప‌రిధిలో క‌ల్వ‌ర్టు ప‌క్క‌న ఒక కాలువ ప్ర‌వ‌హిస్తోంది. అయితే, రాత్రి పూట.. అందులో వేగంగా ఉండ‌టం.. వ‌ర్షం వ‌ల్ల కాలువ పొంగి ప్ర‌వ‌హించ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల అక్క‌డ ఉన్న కాలువ‌ను డ్రైవ‌ర్ గుర్తించ‌క‌పోయి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వేగంగా వ‌చ్చిన కారు ఆ కాలువ‌లోకి ప‌డిపోయింది. రాత్రిపూట కావ‌డంతో ఎవ‌రూ చూడ‌లేక‌పోయారు. అప్ప‌టికే కాలువ నిండుగా ప్ర‌వ‌హిస్తోంది. కారు కాలువ‌లో ప‌డిపోయిన త‌ర్వాత అందులోని ప్ర‌యాణికులు బ‌య‌టికి రాలేక‌పోయారు. కారు డోర్లు లాక్ చేసి ఉండ‌టంతో అందులోనే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఎనిమిది మంది మ‌ర‌ణించారు. వీరిలో ఇద్ద‌రు మ‌హిళ‌లున్నారు. ముగ్గురు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. కారును, అందులోని మృత‌దేహాల్ని వెలికి తీశారు. అనంత‌రం మృత‌దేహాల్ని పోస్టుమార్టం కోసం త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంపై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం మోహ‌న్ యాద‌వ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ.4 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు

Original source: ntnews.com
Read more on Kaizer News