Kaizer News

రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మల తొలగింపు

రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మల తొలగింపు

· State - Telangana · prabhanews.com

రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగిస్తున్న సర్పంచ్ ప్రసాద్ వీడీసీ సభ్యులు భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలంలోని జాగిర్యాల్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆదివారం పారిశుధ్య, మౌలిక వసతుల మెరుగుదల పనులు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న చెట్ల కొమ్మలను సర్పంచ్ గడల ప్రసాద్, ఉపసర్పంచ్ రాజేశ్వర్, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు కలిసి తొలగించారు.అలాగే గ్రామంలో పాడైపోయిన హైమాక్స్ లైట్లను తొలగించి, వాటి స్థానంలో నూతన లైట్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా, రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు అందేలా చర్యలు చేపట్టినట్లు పాలకవర్గం తెలిపింది. గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News