Kaizer News

Kamanhikallu | సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ

Kamanhikallu | సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే..!

· State - Telangana · ntnews.com

ఖమ్మం రూరల్, సెప్టెంబర్19 : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంటకయ్యలు కామంచికల్లు సర్పంచ్ ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన బొప్పిడి ప్రభాకర్‌తో మాట్లాడి.. వారి తండ్రి బొప్పి సైదులు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం కామంచికల్లు గ్రామంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటయ్యలు పర్యటించారు. గ్రామ సర్పంచ్ బొప్పి ప్రభాకర్ తండ్రి అయిన బొప్పి సైదులు ఇటీవల అనారోగ్య కారణంతో మరణించిన విషయం తెలిసి మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌తో కలిసి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఇంటికి వెళ్లారు. ప్రభాకర్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే.. సైదులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు బీఆర్‌ఎస్ నేతలు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లింగన్న బోయిన సావిత్రి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగాల ఉపేందర్, ఎదులాపురం సొసైటీ డైరెక్టర్ మేదరమట్ల శ్రీనివాసరావు, స్థానిక నాయకులు లింగయ్య, ప్రతాపనేని రవి, శ్రీనివాసరావు, రాంబాబు, భద్రయ్య, కృష్ణ, నరేష్, వెంకన్న, నాగేశ్వరరావు, వినోద్, రేఖ, సురేష్ తదితరులు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News