Kaizer News

మరో పీయూపీ ఇవ్వాల్సిందే..

· State - Telangana · sakshi.com

ఫ భాస్కర్‌ టాకీస్‌ నుంచి వలిగొండ క్రాస్‌రోడ్డు నడుమ నిర్మించాలని డిమాండ్‌ ఫ ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదన్న నినాదంతో ఉద్యమం చౌటుప్పల్‌ : హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ పట్టణంలో జరుగుతున్న బ్లాక్‌స్పాట్‌ పనులు స్థానిక వ్యాపారులు, నివాసితులకు సమస్యగా మారాయి. నవోదయ టాకీస్‌ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు అండర్‌పాస్‌ పనులు ఆరు నెలలుగా కొనసాగుతున్నాయి. భాస్కర్‌ టాకీస్‌ వద్ద ఒక పీయూపీ (పెడెస్ట్రెయన్‌ అండర్‌పాస్‌) మంజూరు చేసినప్పటికీ, అక్కడి నుంచి వలిగొండ క్రాస్‌ రోడ్డు వరకు సుమారు 800 మీటర్ల మధ్య దూరం ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండింటి మధ్య మరొక పీయూపీ ని నిర్మించాలనే డిమాండ్‌తో ప్రజలు పోరుబాట పట్టారు. పట్టణంలో ప్రస్తుతం ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ఎదుట వీయూపీ (వెహికల్‌ అండర్‌పాస్‌), చిన్నకొండూర్‌ చౌరస్తా, తంగడపల్లి చౌరస్తాలను కలుపుతూ ఏడు పిల్లర్లతో ఆరు ఓపెన్‌ వీయూపీలతోపాటు వలిగొండ చౌరస్తాలో మరో వీయూపీ ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా భాస్కర్‌ టాకీస్‌ ముందు స్థానిక జనాలు, చిన్నచిన్న వాహనదారులను దృష్టిలో ఉంచుకొని ఒక పీయూపీ నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి వలిగొండ క్రాస్‌ రోడ్డు వరకు దూరం ఉంటున్నందున అదనంగా మరో పీయూపీ ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో సమస్యలు తలెత్తవని ప్రజలు పేర్కొంటున్నారు. భాస్కర్‌ టాకీస్‌ నుంచి వలిగొండ క్రాస్‌రోడ్డు నడుమ మధ్య పాయింట్‌ చూసుకొని ఎక్కడైనా పీయూపీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈమేరకు ఆయా వర్గాలు కార్యాచరణ ప్రారంభించాయి. ఇప్పటికే పలు శాఖల అధికారులకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. పీయూపీ సాధన ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు. పీయూపీ నిర్మాణం లేకుంటే చాలా రంగాలకు ఇబ్బందిగా మారనుంది. ఈ 800 మీటర్ల మధ్య ప్రాంతంలో ఫైర్‌ స్టేషన్‌, కస్తూర్బా గాంధీ పాఠశాల, కళాశాల, బస్తీ దవాఖానా, పెట్రోల్‌బంకు, వందలాది దుకాణాలు, వ్యాపార సంస్థలు, నాలుగు బ్యాంకులు, రెండు పాఠశాలలు, ఈఎస్‌ఐ ఆస్పత్రి, ఎనిమిది కాలనీలు, ప్రభుత్వ హాస్టల్‌ భవనం, జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టు, ఇండోర్‌ స్టేడియం, వాహనాల మరమ్మతులు, విక్రయాలకు సంబంధించిన ఆటోనగర్‌, ఫంక్షన్‌హాల్‌, శ్రీనివాస్‌ టాకీస్‌, ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దశాబ్దాల కాలంపాటు సేవలందించే ఈ రహదారిని ఇప్పుడే ప్రణాళికలతో నిర్మాణం చేయాలని, అందులో బాగంగా అదనంగా మరో పీయూపీ నిర్మించాలని కోరుతున్నారు. ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్ ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు.. రౌడీషీటర్ కమ్మసాయి దారుణ హత్య.. అసలేం జరిగింది..

Original source: sakshi.com
Read more on Kaizer News