Kaizer News

Warangal: నీట్ పీజీ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 1

Warangal: నీట్ పీజీ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు

· State - Telangana · hmtvlive.com

వరంగల్: ఆగస్టు 30 వ తేదిన వరంగల్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించే NEET (PG) -2026 పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ శ్వేత ఐపిఎస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు తో పాటు ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News