Shorts Badvel: శనివారం స్థానిక భగత్ సింగ్ నగర్ లోని ప్రాంతీయ కార్యాలయం నందు ఆ పార్టీ బృందం ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 30 డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ బ్రహ్మసాగర్ 17 టి.యం.సి.ల నీటిని నిల్వవుంచి నియోజకవర్గంలోని ప్రతి చెరువును నింపాలి.వెలిగొండ ప్రాజెక్టునీటిని కలసపాడు మండలం రాచెరువుకు తరలించాలి. కుందూ ఎత్తిపోతల పథకాన్ని త్వరిగతిన పూర్తి చేయాలి, సొమశిల ఎత్తిపోతల పథకం జి.ఓను.. అమలు పరచి నిధులు కేటాయంచి వెంటనే పనులు చేపట్టాలి. పెద్దచెరువును 1టి.యం.సి. నీటితో నింపాలి.బద్వేలు పెద్దచెరువును మరియు కలసపాడు మండలం రాచెరువును మినీ రిజర్వాయర్లగా ప్రకటించాలి.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేదుకు ప్రభుత్వమే ఈ ప్రాంతంలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపనీలను ఏర్పాటు చేయాలి. బంకమట్టి, ఎర్రచందనం, జామాయిల్ వెదురు ఆదారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. కలసపాడు, కాశినాయన, బి. కోడూరు మండలాలల్లో వ్యవసాయ ఆధారిత, లెదర్, డైరి ఫాం, కోళ్ళ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పరిశ్రమల ఏర్పాటుకు తగు రాయతీలు కల్పించాలి. అట్లూరు మండలాన్ని ఉద్యాన వన పంటల కేంద్రంగా పండ్లతోటల ఉత్పత్తి కేంద్రంగా ప్రకటించి విత్తన శుద్ధి నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నియోజక వర్గంలోని ప్రతి మండలంలో పాడి పరిశ్రమను ప్రొత్సహించి పాల కేంద్రాలు ఏర్పాటు చేయాలి. బద్వేలు పట్టణంలో డి.యస్.పి. కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి.బద్వేలు, పోరుమామిళ్ళ, పట్టణాలలో స్వచ్ఛభారత్కు నిధుల కేటాయింపును పెంపుదల చేయించి డ్రైనేజీ వ్యవస్థను పునర్మించి పారిశు ద్యం చేయించి సుందరీకరణ పనులు చేపట్టాలి, చెట్లను పెంచే కార్యాక్రమం చేపట్టి పచ్చదనం పెంపోదించాలి. బద్వేలు మున్సిపాలిటి పరిధిలో చిల్డ్రన్స్ పార్క్, కళాక్షేత్రం, మినీ స్టేడియం (క్రీడాకారుల కోసం) ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలి, బద్వేలు పట్టణములో ప్రభుత్వ డిగ్రీకాలేజి ఏర్పాటు చేయాలి. పారా మెడికల్ కు సంబంధించిన, నర్సింగ్ కు సంబందించిన కళాశాల ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఐ.టి.ఐ కళాశాల ఏర్పాటు చేయాలి. పోరుమామిళ్ళ పట్టణాన్ని మున్సిపాలిటిగా అప్గ్రేడ్ చేసి పోరుమామిళ్ళ పట్టణానికి రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలి. బద్వేలు, పోరుమామిళ్ళ పట్టణాలలో నైపుణ్య శిక్షణా కేంద్రం, డ్రైవింగ్ స్కూల్ లాంటివి ప్రభుత్వమే ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించాలి. అట్లూరు మండలంలోని ఆటవీ చెక్ పోస్ట్ ను తొలగించాలి. బద్వేలు పట్టణంలోని నాగులచెరువును, బాకారాపేట చెరువును మిని ట్యాంక్ బండగ మార్చి జాతీయ, స్వాతంత్య్రసమరయోధుల, చరిత్రకారుల, సంగీత సాహిత్య కారుల విగ్రహాలను ఏర్పాటు చేయాలి.) బద్వేలు పోరుమామిళ్ళ పట్టణంలోని ఆసుపత్రులను 500 పడకల ఆసుపత్రిగా మార్చి సాంకేతిక పరమైన, ల్యాబోరైటరీ పరమైనా పరికరాలను ఏర్పాటు చేసి తగినంత మంది సిబ్బందిని నియమించి సామాన్య ప్రజానికాని వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి. బద్వేలు మున్సిపాలిటి అభివృద్ధికి 500 కోట్ల నిధులు కేటాయించాలి. అధ్యాత్మిక, పర్యాటక