Shorts Off The Record: విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. మొదటి నుంచీ ఈ నియోజకవర్గంగా టీడీపీ కంచుకోట. కానీ 2019లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేవ్ వీచింది. 2024లో మళ్లీ టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో భీమిలీ సెగ్మెంట్ ఫ్యాన్ పార్టీకి అంతగా అచ్చిరావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈలోగా ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైగా సమయం ఉండగా.. భీమిలి వైసీపీ చీఫ్ మజ్జి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేయడంతో ఈ సెంటిమెంట్‌కు బలం చేకూరినట్టయ్యింది. కాపు సామాజికవర్గం ఈక్వేషన్స్‌తో ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్దదిక్కుగా భావించే సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనుకు భీమిలి పార్టీ పగ్గాలు అప్పజెప్పింది ఆ పార్టీ అధిష్టానం. అయితే చిన్న శ్రీను అనూహ్యంగా జగన్‌కు హ్యాండిచ్చి సైకిల్ ఎక్కేశారు. మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను వైసీపీకి, భీమిలి సమన్వయకర్త పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో ఆ నియోజకవర్గ పగ్గాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో యువనేత గండ్రెడ్డి శ్రీనివాస్ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, అధిష్ఠానం ఇతర ప్రత్యామ్నాయాలపై కూడా కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. భీమిలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరు ప్రస్తుతం ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. చిన్న శ్రీను నిష్క్రమణ తర్వాత నియోజకవర్గంలో పార్టీని చక్కదిద్దేందుకు మెజారిటీ స్థానిక నేతలు గండ్రెడ్డి శ్రీనివాస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. భీమిలిలో టీడీపీ తరఫున బలమైన నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావును ఢీకొట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక కొత్త వ్యూహంతో, నమ్మకస్తుడైన ఒక యువ నాయకుడిని ఇన్‌చార్జ్‌గా దించే యోచనలో ఉన్నట్లు కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల క్రమంలో గండ్రెడ్డి శ్రీనివాస్ పేరు దాదాపూ ఖరారవుతుందేమోనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ భీమిలి ప్రాంతంలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో అక్కడ బలమైన కూటమి నేతలను ఢీకొట్టే క్రమంలో వైసీపీ అధిష్టానం గండ్రెడ్డి శ్రీనివాస్ వైపు మొగ్గు చూపనుందన్నఆసక్తికర చర్చ నడుస్తోంది. భీమిలి వైసీపీ కొత్త నాయకత్వం కోసం పార్టీ అధిష్టానం కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈ బాధ్యతలను సీనియర్ నాయకులు గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, కేకే రాజులకు అప్పజెప్పింది. బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారనే ప్రచారంపై ఇంతవరకు వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే స్థానిక యువకుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి, సర్పంచ్‌గా అనుభవం ఉన్న వ్యక్తి గండ్రెడ్డి శ్రీనివాస్ పేరు ఫ్యాన్ పార్టీ శ్రేణుల్లో రీసౌండ్ చేస్తోంది. తూర్పు